Saturday, November 23, 2024

కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం… రూ.15 లక్షల ఆస్తి నష్టం

- Advertisement -
- Advertisement -

Fire accident in cotton mill in Nalgonda

మనతెలంగాణ/కొండమల్లేపల్లి: నల్లగొండ జిల్లా కేశ్యతండా గ్రామపంచాయతీలోని హైదరాబాద్ కాటన్ మిల్లులో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లు యాజమాని టివిఎన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…. మండల పరిధిలోని కేశ్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని హైదరాబాద్ కాటన్ మిల్లులోని అవరణలో గల పత్తిని జేసిబి (డోజర్) సహాయంతో యంత్రంలోకి ఎత్తి పోస్తున్న క్రమంలో డోజర్ బకెట్ సీసీ నేలకు తాకడంతో నిప్పురవ్వలు చెలరెగి పత్తిని అంటుకొని ప్రమాదం సంభవించినట్లు ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ ఉండటంతో పత్తి మిల్లుకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడంతో మిల్లులో కొంత మంది సిబ్బంది మాత్రమే విధులుకు హాజరు కావడంతో మంటలను ఆర్పలేక పోవడంతో వెంటనే హైదరాబాద్‌లో ఉన్న మిల్లు యాజమాని టివిఎన్‌రెడ్డి సమాచారం అందించారు.

టివిఎన్‌రెడ్డి వెంటనే సిసిఐ అధికారులకు, సమీపంలో ఉన్న పత్తి మిల్లు యాజమానులకు సమాచారం అందజేయడంతో వారి వెంటనే హైదరాబాద్ కాటన్ మిల్లుకు వచ్చి సూచనతో మిల్లు సిబ్బంది అప్రమత్తమై మంటల చెలరేగకుండా నీటిని చల్లుతూ దేవరకొండలోని అగ్నిమాపక సిబ్బంది సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో నీళ్లు కొడుతూ మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో భారి నష్టం జరగకుండా సుమారు రూ.10 నుండి 15 లక్షల స్వల్ప నష్టంతో బయటపడ్డారు. హైదరాబాద్ కాటన్ మిల్లులో సుమారు రూ.60 లక్షల వరకు అక్కడే పత్తి నిల్వ ఉంచారు. సకాలంలో ఫైరింజన్లు రావడంతో భారి నష్టం జరగకుండా బయటపడి, సంక్రాంతి పండుగ ఉండటంతో మిల్లులోని సిబ్బందికి సెలవులకు వెళ్లడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఊపిరి పీల్చుకున్నట్లు మిల్లు నిర్వహకులు తెలిపారు. గత సంవత్సరమే భారీ గాలులతో మిల్లు షేడ్‌లో కొట్టకొని పోయిన నష్టం ఇంకా తీరుకోకపోయామని ఇంతలోని మళ్లి అగ్నిప్రమాదం సంభవించడంతో మిల్లు యాజమాని టివిఎన్‌రెడ్డి బాధతో కుంగిపోయారు. శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో పాటు పలువురు హైదరాబాద్ కాటన్ మిల్లుకు సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News