అహ్మదాబాద్: గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ జిల్లాలోని దీషా నగరంలోని టాపాసుల ఫ్యాకర్టీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం 9.30లకు ఈ ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందాగా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో ఫ్యాకరీ నేలమట్టం అయింది.
ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ మిహిర్ పటేల్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీ పూర్తిగా కుప్పకూలిపోయింది’ అని అన్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఫ్యాక్టరీ ఓనర్ పరారీలో ఉన్నాడు.