Thursday, December 19, 2024

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డెక్కన్ నైట్ వేర్స్ స్పోర్ట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు యువకులు మృతిచెందారు. ఇందులో ఇద్దరి అస్తిపంజరాలు లభించగా, మరో యువకుడిని ఆచూకీ తెలియరాలేదు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని షాపింగ్‌మాల్‌లో గురువారం ఉదయం 11గంటలకు అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్నిమాకప సిబ్బంది 9గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో మాల్‌లో 17మంది ఉండగా పొగలు రావడంతో అందరూ బయటికి వచ్చారు. కానీ రెండో ఫ్లోర్‌లో ఉన్న సామానును తీసుకురావాలని యజమాని ఆదేశించడంతో గుజరాత్ రాష్ట్రం, సోమనాథ్ జిల్లా, వెరావల్ గ్రామానికి చెందిన జునైద్(25), జహీర్(22), వసీం(32)లోపలికి వెళ్లారు. వారు లోపలికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో బయటికి రాలేక అందులోనే చిక్కుకున్నారు.

ముగ్గురు లోపలికి వెళ్తుండగా అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది వారిని ఆపేందుకు యత్నించగా అప్పటికే వెళ్లిపోయారు. వారిని రక్షించేందుకు లోపలికి వెళ్లిన అగ్నిమాక సిబ్బందికి కన్పించకపోవడంతో బయటికి వచ్చారు. ఫోన్ చేసి బయటికి రప్పించేందుకు యత్నించగా ముందుగా రింగ్ అయిన వారి ఫోన్లు తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చాయి. భవనం యజమాని జావెద్ గుజరాత్‌కు చెందిన వాడు కావడంతో ముగ్గురు వర్కర్లను అదే రాష్ట్రం నుంచి తీసుకుని వచ్చినట్లు తెలిసింది. ఇద్దరి మృతదేహాలను డ్రోన్ ద్వారా రెండో ఫ్లోర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురి సెల్ ఫోన్ల లొకేషన్ అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భవనం యజమానిని రాంగోపాల్ పేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News