Sunday, December 29, 2024

ప.గో.జిల్లాలో ఎరువుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఓ ఎరువుల కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఫుడ్స్,ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీలో మంటలు చెలరేగాయి. సాల్వెంట్ ఆయిల్ ట్యాంక్ పేలడంతో సాల్వెంట్ ఆయిల్ (ఎస్‌ఎఫ్ 1) ప్లాంట్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా పొగ కమ్ముకుంది. పలువురు కార్మికులు లోపల చిక్కుకున్నారు. నలుగురిని సహాయక సిబ్బంది రక్షించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొండవీటి చరణ తలారి దుర్గా ప్రసాద్, కోన నాగబాబులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. జగన్నాథపురానికి చెందిన ఓ కార్మికుడి ఆచూకీ గల్లంతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News