- Advertisement -
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో శనివారం వేకువజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రశాంత్ నగర్లో ఎ1 కారు మెకానిక్ షాపులో నుంచి మంటలు రావడంతో వాహనదారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు అక్కడి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పేశాయి. షార్ట్ సర్కూట్‌తో మంటలు చెలరేగి ఉంటాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఎ1 కారు మెకానిక్ షాపు యజమాని ఫరీద్. శుక్రవారం లక్ష రూపాయలు పెట్టి గ్యాస్ తీసుకొచ్చామని తెలిపాడు. షాపు పూర్తిగా దగ్ధం కావడంతో మూడు లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని ఫరీద్ వాపోయాడు. మూడు సంవత్సరాల నుంచి షాపుపై ఆదారపడి తన కుటుంబ జీవిస్తోందని తెలిపాడు.
- Advertisement -