Saturday, April 26, 2025

హయత్‌నగర్‌లో అగ్నిప్రమాదం.. 30 గుడిసెలు దగ్ధం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పరిధిలోని కుంట్లూరులో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి కాలనీ సమీపంలో పేదలు వేసుకున్న గుడిసెల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వ్యాపించి ఇప్పటికే 30కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. కొన్ని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. భారీగా మంటలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనస్థిలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News