Monday, December 23, 2024

కూకట్ పల్లి హోలిస్టిక్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం….

- Advertisement -
- Advertisement -

Fire accident in Holistic hospital in Kukatpally

 

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని హోలిస్టిక్ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి మొదటి అంతస్థులో మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ కమ్ముకుంది. ఆస్పత్రి సిబ్బంది రోగులను అంబులెన్స్ మరో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శేరిలింగంపల్లి ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ ఆస్పత్రికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. షార్ట్ సర్యూట్ కారణంగానే మంటల వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ఆస్పత్రిలో 70 మంది చికిత్స పొందుతున్నారని ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ చెప్పారు. రోగుల ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News