Monday, December 23, 2024

జమ్మూలో భారీ అగ్నిప్రమాదం…

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని రాజ్‌బాగ్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యాపారసమూదాయంలోని ఓ భవనం నుంచి మంటల చెలరేగాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. మంటలను ఆర్పే క్రమంలో ఓ అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణం నష్టం లేదని ఆస్తి నష్టం భారీగా జరిగిందని అగ్నిమాపక అధికారి పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచామని పోలీసులు తెలిపారు. గ్యాస్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపకసిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News