Thursday, January 23, 2025

మండుతున్న ఎండలు.. కాలిపోయిన జేసీబీ

- Advertisement -
- Advertisement -

రుద్రంగి: మండుతున్న ఎండల కారణంగా రుద్రంగి మండలం వీరునితండా గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో జేసీబీ పూర్తిగా దగ్థమైంది.వివరాలలోకి వెళితే.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మానాల – మరిమడ్ల రోడ్డు పనుల్లో భాగంగా అటవీ ప్రాంతంలో జేసీబీతో పనులు చేస్తున్నారు.

బుధవారం ఉదయం నుండి జేసీబీతో రోడ్డు పనులు చేసి డ్రైవర్ భోజనానికి వెళ్లిన 5 నిమిషాల్లోనే జేసీబీలో మంటలు వచ్చి పూర్తిగా కాలిపోయింది. మండుతున్న ఎండల కారణంగానే జేసీబీలో మంటలు వచ్చాయని, దాదాపు 30 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందన్నారు. సంఘటన స్థలాన్ని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, నాయకులు రాజారాంతో కలిసి ఎస్‌ఐ ప్రభాకర్ పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News