Sunday, January 19, 2025

కరాచీ బేకరీ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

Fire accident in Karachi Bakery Godown

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గగన్ పహాడ్‌లోని కరాచీ బేకరీ గోడౌన్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు గోడౌన్ అంత వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగ అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో రూ.10 లక్షల విలువైన సొత్తు దగ్ధమైంది. అయితే ఎలాంటి మానవ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News