Monday, January 20, 2025

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం… తప్పిన ప్రాణనష్టం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జగిత్యాల రహదారిలో సుభాష్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పూరిళ్లు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. మంగళవారం పూరిళ్ల నుంచి మంటలు చెలరేగాయి. ఐదు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. పూరిళ్లలో నివసించేవారు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News