Monday, December 23, 2024

కోణార్క్ ఎక్స్ ప్రెస్‌లో పొగలు

- Advertisement -
- Advertisement -

వరంగల్: కోణార్క్ ఎక్స్ ప్రెస్‌ కు పెను ప్రమాదం తప్పింది. ఎసి బోగీలో పొగలు రావడంతో డోర్నకల్ రైల్వే జంక్షన్ వద్ద రైలును నిలిపివేశారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పొగలు వ్యాపించిన ఎసి బోగీని రైలు నుంచి వేరు చేశారు. ప్రయాణికులను మరో బోగీలోకి ఎక్కించారు. సాంకేతిక కారణాలతో పొగలు వ్యాపించాయా? లేక ఇతర కారణాలా అనేది తెలియాల్సి ఉందని అధికారులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News