Wednesday, January 22, 2025

కోఠి బ్యాంకు స్ట్రీట్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident in Koti Bank Street

హైదరాబాద్: కోఠి బ్యాంకు స్ట్రీట్ లోని ఓ దుకాణంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. భవనం మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో దుకాణంలోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపకసిబ్బంది మంటలను అదుపుచేశారు. మంటల్లో చిక్కుకున్న నలుగురిని ఫైర్ సిబ్బంది కాపాడారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని క్రీడా సామాగ్రి అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News