- Advertisement -
హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున కాపర్ రీసైక్లింగ్ యూనిట్‌లో అగ్ని ప్రమాదం సంభవించగా.. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లు, 10 వాటర్ ట్యాంకులతో మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రూ.కోటి విలువైన కాపర్ తుక్కు దహనమైంది. అంతేకాక.. ఈ ప్రమాదం కారణంగా పక్కనే ఉన్న ‘డాకన్ సీ’ అనే కంపెనీలో రూ.కోటి విలువైన ముడి సరుకు, యంత్ర సామాగ్రి దెబ్బతిన్నాయి.
- Advertisement -