Monday, January 20, 2025

మహాకుంభ్‌మేళాలో పేలిన సిలిండర్

- Advertisement -
- Advertisement -

18 గుడారాలు ఆహుతి
మహాకుంభ్ నగర్(యూపీ): మహాకుంభ్ మేళాలో ఆదివారం సిలిండర్ పెద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 19లో 18 గుడారాలు దగ్ధం అయ్యాయి. అయితే ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. 18 గుడారాలకు మంటలు పాకడంతో వెంటనే 15 అగ్నిమాపక శకటాలను తరలించామని, మంటలను ఆర్పేశామని కుంభ్‌మేళా ప్రధాన అగ్నిమాపక అధికారి ప్రమోద్ శర్మ తెలిపారు. దీనికి ముందు అఖాడా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జీ భాస్కర్ మిశ్రా మాట్లాడుతూ మహాకుంభ్ మేళా సెక్టార్ 19లో రెండు ఎల్‌పిజి సిలిండర్‌లు పేలాయి, దాంతో క్యాంపుల్లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.

అయితే మంటలని అధికారులు సకాలంలోనే అదుపులోకి తెచ్చారు. కాగా మహాకుంభ్ అధికారిక ‘ఎక్స్’ పోస్ట్‌లో ‘ఇది చాలా విషాధకరం! మహాకుంభ్ మేళాలో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అధికారులు వెంటనే రెస్కూ ఆపరేషన్ చేపట్టారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ఆ గంగా మాతను ప్రార్థిస్తున్నాం’ అని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం తాలూకు మంటలు, పొగకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేశారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ ఆందోళనను వ్యక్తం చేయడమేకాక, ప్రభుత్వం సత్వరంగా రెస్కూ ఆపరేషన్ చేపట్టాలని కోరింది. 45 రోజుల మహాకుంభ్ మేళా 2025 పౌష్య పూర్ణిమా నాడు(జనవరి 13)న మొదలయింది. ఇప్పటి వరకు 7.72 కోట్ల మంది త్రివేణి సంగంలో పవిత్ర స్నానం ఆచరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News