Monday, December 23, 2024

ఒఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం: లారీ దగ్ధం…

- Advertisement -
- Advertisement -

Fire accident in Lorry in Rangareddy

రంగారెడ్డి: ఔటర్ రింగ్ రోడ్డు డివైడర్‌ను లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లారీ అతివేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. దీంతో తారామతి పేట నుంచి శంషాబాద్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాదారుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News