Thursday, April 3, 2025

భవనంలో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

కండివాలి : ముంబైలోని కండివాలి వెస్ట్‌లోని మహావీర్ నగర్‌లోని పవన్ ధామ్ వీణా సంతూర్ భవనంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం చెలరేగిన మంటల్లో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులను గ్లోరీ వాల్‌ఫాటి (43), జోసు జెమ్స్ రాబర్ట్ (8)గా గుర్తించారు. వీరిద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న అధికారులు ఎనిమిది ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. తొమ్మిది అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News