Sunday, April 6, 2025

మైలాన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: మైలాన్ పరిశ్రమలో  జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది . వివరాలలోకి వెళితే పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జిన్నారం మండలం గడ్డపోతారం మైలాన్ పరిశ్రమలో గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సంఘటన స్థలంలోనే మగ్గురు మృతిచెందగా,పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మృతుల్లో ఒకరు బంగల్ వాసి పరితోష్ మెహతా (40),  శ్రీకాకుళం వాసి లోకేశ్వర్ రావుగా,బిహార్‌ వాసి రంజిత్‌కుమార్‌ (27) పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News