- Advertisement -
హైదరాబాద్: నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బంజారాహిల్స్‌లో ఉన్న పార్క్ హయత్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు హోటల్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ నుంచి భారీగా పొగ వెలువడడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగు కమ్ముకున్నారు. హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్లు అదే హోటల్‌లో ఆరో అంతస్థులో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాళ్లు హోటల్ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలు కానీ, ఈ ప్రమాదంలో ఏ మేరకూ ఆస్తి నష్టం జరిగిందనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -