Friday, December 20, 2024

నడుస్తున్న బస్సులో మంటలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నడుస్తున్న ప్రైవేటు బస్సు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన హైదరాబాద్ లోని బాలానగర్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఆరెంజ్ వోల్వో ట్రావెల్స్ బస్సు శుక్రవారం సాయంత్రం సుచిత్రా నుంచి కూకట్ పల్లికి బయలు దేరింది. మార్గ మధ్యలో బాలానగర్ ఐడిపిఎల్ ససమీపంలోని పెట్రోల్ బంకు దగ్గరకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు రావడంతో అది గమనించిన డ్రైవర్ బస్సులో ఉన్న ప్రయాణికులని కిందకు దింపారు.

ఘటన సమయంలో బస్సులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.ఈ ఘటనతో బాలానగర్ , జీడిమెట్ల నుంచి కూకట్పల్లి వచ్చే దారిలో రాత్రి 8 గంటలకు వరకు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News