Tuesday, December 24, 2024

జూలపల్లిలో 3 పూరి గుడిసెలు దగ్ధం

- Advertisement -
- Advertisement -

మహమ్మదాబాద్ : మండల పరిధిలోని జూలపల్లి గ్రామంలో మూడు గుడిసెలు దగ్దమైన సంఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, మొదటగా ఒక గుడిసెలో కరెంటు తీగల షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక గుడిసె అంటుకున్నది. ఆ గుడిసెలోని సిలిండర్ పేలడం వల్ల మంట పక్కనే గల మరో రెండు గుడిసెలకు వ్యాపించింది. సంఘటన సమయంలో వాటిలో ఎవరు లేకపోవడతో పెను ప్రమాదం తప్పింది. అయితే గుడిసెలు గ్రామంలోని అత్యంత బీదలైన వడ్డే వెంకట్ రాములు, వడ్డే వెంకటమ్మ, వడ్డే వెంకట్ రాములుకు సంబంధించినవిగా తెల్సింది.

అయితే ఆ గుడిసెలలో కూలి నాలీ చేసుకొని, పెట్టుకున్న సుమారు రూ. 50వేలు, ఆహారం ధాన్యాలు తదితర మొత్తం సర్వనాశనం అయ్యాయని, కట్టుబట్టలతో మిగిలిపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమను ఆదుకోవాలని బోరున విలపిస్తున్నారు. అలాగే పక్కా ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న బాధితులు, కళ్ల ముందు చూస్తుండగానే మూడు గుడిసెలు దగ్దమవడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News