Monday, December 23, 2024

రామాంతపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం రామాంతపూర్‌లో ఫ్లైవుడ్ ఫర్నిచర్ గోడౌన్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు వ్యాపించి పొగలు అలుముకోవడం గమనించిన స్థానికులు వంటనే అగ్ని ప్రమాద సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో హుటాహుటినా గఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News