Wednesday, January 8, 2025

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని పాలిక బజార్‌ సమీపంలోని ఓ దుకాణంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బజార్‌లోని ఓ బట్టల దుకాణంలో అకస్మాత్తుగా ప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక దళం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేసింది. మంటలు కాస్త పెరిగి పక్కనే ఉన్న లాడ్జిలోకి వ్యాపించాయి.

మంటల తీవ్రత కారణంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన దట్టమైన పొగ అలుముకుంది. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. పాలికా బజారులో 4 వందల షాపులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితి స్థానికుల్లో తీవ్ర భయాందోళనలకు దారితీసింది. నేడు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో లష్కర్‌ బోనాలు కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News