Sunday, December 22, 2024

షేక్‌పేటలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ లీకై అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన షేక్‌పేట వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. చెలరేగిన మంటలు వైర్లకు అంటుకొని పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించాయి. రెండు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News