Thursday, January 23, 2025

టింబర్ డిపోలో అగ్నిప్రమాదం.. కలప దగ్ధం

- Advertisement -
- Advertisement -

Fire accident in timber depot at Musheerabad

హైదరాబాద్: ముషీరాబాద్‌లోని కలప డిపోలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎండిన కలప భారీ స్టాక్‌కు మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే భారీ నష్టం వాటిల్లిందని గోడౌన్ యజమాని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా దీపావళి క్రాకర్స్ వల్ల జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సోమవారం రాత్రి మోతీనగర్‌లోని నోబుల్‌ అపార్ట్‌మెంట్‌పై సెల్‌ టవర్‌ దగ్ధమైంది. అపార్ట్‌మెంట్‌ పైకప్పుపై కొందరు క్రాకర్స్‌ పేల్చడంతో మంటలు చెలరేగాయి. మూడు లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News