Wednesday, January 22, 2025

కొంపల్లి ఎస్ బిఐ బ్యాంక్ లో అగ్నిప్రమాదం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఎస్ బిఐ బ్యాంక్ లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో బ్యాంక్ నుంచి మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సామాగ్రి, ఎసిలు, విలువైన వస్తువులు కాలిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రెండు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని బషీర్ బాద్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News