Saturday, January 11, 2025

కామినేని ఆసుపత్రి వద్ద అగ్ని ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కింగ్ కోఠి ప్రాంతంలో ఉన్న కామినేని ఆసుపత్రి సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్యూరిటీ గార్డు సంతోష్ మరణించాడు. అతడు కారులో పడుకుని ఉండగా కారు తగులబడి అతడు చనిపోయాడు. ఈ ఘటన ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అందిన సమాచారం ప్రకారం ఏడు కార్లకు మంటలు అంటుకున్నాయి. కాగా వాటిలో మూడు పూర్తిగా తగులబడిపోయాయి. మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే, ఓ కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు తప్పించుకోలేనంతగా. అతడు పడుకున్న కారయితే కాలి బొగ్గయిపోయింది.

కామినేని ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వగానే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అగ్నిమాపక దళం హుటాహుటిన ప్రమాదస్థలికి చేరకుంది. తర్వాత వారు మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ సెక్యూరిటీ గార్డును మాత్రం సకాలంలో కాపాడలేకపోయారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మస్కిటో కాయిల్ లేక సిగరెట్ వల్ల మంటలు అంటుకుని ఉండొచ్చని సందేహిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా చోటుచేసుకుందన్నది ఇంకా నిర్ధారణ కావలసి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News