Wednesday, January 22, 2025

కొండమడుగులో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

fire accident near Kondamadugu of Yadadri district

యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చందుక్ ల్యాబొరేటరీస్ ఫార్మా కంపెనీలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బీబీనగర్ మండలం కొండమడుగు సమీపంలోని చందక్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. విపరీతమైన పొగ కారణంగా కంపెనీలోని ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఇబ్బందులు పడ్డారని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News