Thursday, April 3, 2025

ప్రజా భవన్ వద్ద అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సోమాజిగూడ చౌరాస్తా సమీపంలో ఉన్న ప్రజాభవన్ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రజాభవన్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…భూగర్భ ట్యాంకు మూత తీస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక దళాల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News