Wednesday, March 12, 2025

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ లోని సూర్య తేజ ఇండస్ట్రీ6స్, లిఫ్ట్ గ్రిల్స్ తయారీ కంపెనీలో ఆదివారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. గ్రిల్స్ కి పెయింట్ వేసి కంపెనీ క్లోజ్ చేసి సిబ్బంది వెళ్ళి పోయిన తరువాత కంపెనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల  మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ  ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బాలానగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News