Monday, December 23, 2024

ఆత్మీయ సమ్మేళనంలో అగ్నిప్రమాదం: వలస కూలీ మృతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడులో బిఆర్ఎస్ ఆత్మయ సమ్మేళనంలో బుధవారం అపశృతి చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన వలసకూలీ సందీప్ మృతిచెందాడు. వైరా నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు బాణసంచా పేల్చారు.

ఈ క్రమంలో తారాజువ్వ పడటంతో సమీపంలోని గుడిసెకు నిప్పు అంటుకుంది. గుడిసెలోని గ్యాస్‌ సిలిండర్‌ పేలి భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సహా 8 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News