Sunday, December 22, 2024

కేపీహెచ్‌బీలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలోని కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వ్యాపించి ఎగిసిడుతుండటంతో కొంతమంది అపార్టుమెంట్ వాసులు చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసి 15 మంది అపార్ట్‌మెంట్‌ వాసులను రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News