Friday, December 20, 2024

ముగ్గురి బతుకులు బుగ్గి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/జిన్నారం: సంగారెడ్డి జిల్లాలో ఘో రఅగ్నిప్రమాదం సంభవించింది. జిన్నారం మం డ లం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని మైలాన్ ప రిశ్రమలోవేర్‌హౌస్ బ్లాక్‌లో ఆదివారం మధ్యా హ్నం మంటలు చెలరేగి ముగ్గురు కార్మికులు మృ త్యువా త పడ్డారు. ప్రమాదంలో శ్రీకాకుళంనకు చెం దిన ప రిశ్రమ అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్‌రావు (38), పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడు పరితోష్ మె హతా (40), బిహార్‌కు చెందిన మరో కార్మికుడు రంజిత్ కుమార్ (27) తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించగా మార్గంమధ్యలో మృతి చెందారు. పరిశ్రమలోని రసాయన సాల్వెంట్లు భద్రపరిచే గో డౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించడంతో ఈ ఘటన జరిగింది. విధులు ని ర్వహిస్తున్న కార్మికులు ప్రమాదం చనిపోయారు. స మాచారం అందుకున్న అగ్నిమాపక సి బ్బంది ఘట నా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనపై విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మృతి చెందిన కార్మికుల మృతదేహాలను పటాన్‌చేరు ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు.ముగ్గురు కార్మికుల మృతితో పారిశ్రమికవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

భద్రత లోపాల వల్లే ప్రమాదాలు

పారిశ్రామిక వాడల్లో తరచూ జరుగుతున్న అగ్ని ప్ర మాదాల్లో ముఖ్యంగా భద్రత ప్రమాణాల్లో లోపాలు కన్పిస్తున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ప రిశ్రమల్లో నిపుణులైన కార్మికులను పెట్టకుండా ఇ స్టారీతిన తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులను వినియోగిస్తున్నారన్న అభియోగాలున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భంలో సమీపంలో ఎ లాంటి రక్షణ పరమైన ఫైర్ ఇంజన్లు లేకపోవడంతో అటు జీడిమెట్ల ఇటు నర్సాపూర్ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు రావడం ఆలస్యం అవుతుండడంతో అప్పటికే జరగాల్సిన తీవ్ర నష్టం జరుగుతోందన్న వాదన విన్పిస్తోంది. పరిశ్రమల్లో రక్షణ చర్యలను తనిఖీలు జరపాల్సిన అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ప్రమాదాలకు కారణమని స్థానికులు అంటున్నారు. కాగా, ఇలా పరిశ్రమల్లో తరచూ జరుగుతు న్న ప్రమాదాల్లో అమాయక కార్మికులు తమ జీవితాలను బలి చేసుకుంటున్నారన్న వాదనా బలంగా విన్పిస్తోంది. ఇప్పటికైనా పరిశ్రమలు భద్రత ప్రమాణాలు పాటించేలా, అధికారులు చర్యలు చేపట్టాలని పారిశ్రామికవాడకు చెందిన ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News