Friday, December 20, 2024

ఇరాక్ పెళ్లి హాల్‌లో మంటలు..100 మంది బుగ్గి

- Advertisement -
- Advertisement -

మొసూల్ : ఇరాక్ ఉత్తర ప్రాంతంలో హమ్‌దానియాలో ఓ ఫంక్షన్ హాల్‌లో చెలరేగిన మంటలలో వంద మంది వరకూ ఆహుతి అయ్యారు. 150 మంది వరకూ కాలిన గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం అర్థరాత్రి క్రిస్టియన్ కుటుంబం పెళ్లి వేడుకలో బాణాసంచాలు కాల్చడం అదుపు తప్పి మంటలకు దారితీసింది. తీవ్రస్ధాయి విషాదం నెలకొంది. పెళ్లికి భారీ సంఖ్యలో జనం తరలిరావడం, ఫంక్షన్ హాల్‌లో మండే స్వభావం ఉన్న సామాగ్రి ఉండటంతో మంటలు ఉన్నట్లుండి ఎగబాకినట్లు తెలిసింది. మొసూల్ నగరానికి వెలుపల క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. షాండ్లియర్‌కు మంటలు అంటుకోవడంతో చాలా మంది కాలిపొయ్యారు. మంటలు వ్యాపిస్తున్న దశలో వధూవరులు స్టేజీపై డాన్స్ చేస్తున్నారు.

చాలా మంది పాటలు పాడుతూ, గంతులేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఏమిటనేది అధికారికంగా వెల్లడికాలేదు. అయితే బాణాసంచా వల్లనే ఈ ఘోర దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని కుర్ధీష్ టీవీ ఛానల్ రుదావ్ కూడా నిర్థారించింది. ఇరాక్‌లో క్రమేపీ తగ్గిపోతున్న క్రిస్టియన్లకు ఈ ఘటన మరో చేదు అనుభవం అయింది. ఫంక్షన్ హాల్ అలంకరణకు పై భాగంలో అమర్చి ఉన్న ప్లాస్టిక్ సామాగ్రికి మంటలు అంటుకోవడంతో అవి కింద కుప్పకూలడంతో పలువురు మంటలలో చిక్కుపడ్డారు. ప్రవేశ ద్వారం వద్ద జనం కిక్కిరిసిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇరాక్‌లో వివాహ వేడుకలు అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది అక్కడ సర్వసాధారణం అయింది. వేలాది మందిని కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా గంటల తరబడి పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి. ఆకర్షణీయరీతిలో జరిగే పలు విన్యాసాలకు దిగుతారు. బాణాసంచా పేల్లుళ్లు, జ్వాలలతో విన్యాసాలు చేస్తూ ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News