Thursday, January 23, 2025

అణువిద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియా అణువిద్యుత్ కేంద్రంలో పేలుళ్ల సంభవించి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ రష్యా నియంత్రణలో ఉంది. ఈ ప్లాంట్‌లో పేలుళ్లకు రష్యా దళాలే పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపిస్తుండగా, ఉక్రెయిన్ ప్రయోగించిన ఫిరంగి గుండ్ల వల్లనే మంటలు చెలరేగాయని రష్యా వాదిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రదేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ప్లాంట్‌నుంచి అణు లీక్ జరగలేదని చెప్పారు. ప్రమాద స్థలానికి తమను వెళ్లనీయాలని కోరారు.

అణుకేంద్రానికి సంబంధించిన కూలింగ్ టవర్‌లో ఆదివారం భారీగా మంటలు చెలరేగగా, తమ దళాలు వాటిని సోమవారం నాటికి పూర్తిగా ఆర్పేశాయని అణుప్లాంట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న రష్యా నియమిత గవర్నర్ యూవ్‌గెవ్‌నీ బాలిటెస్కీ పేర్కొన్నారు. 2022 లో రష్యా దళాలు ఈ అణు కేంద్రాన్ని తమ అధీనం లోకి తెచ్చుకున్నాయి. దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడ అణువిద్యుత్ ఉత్పత్తి జరగలేదు. మొత్తం రియాక్టర్లను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కోల్డ్ షట్‌డౌన్‌లో ఉంచారు. అయితే తాజాగా ఈ ప్లాంట్ కూలింగ్ టవర్‌పై డ్రోన్ దాడిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిపుణులు ఎక్స్‌లో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News