కీవ్ : రష్యా దళాల బాంబు దాడిలో జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలను ఆర్పేసినట్టు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. రేడియేషన్ స్థాయిల్లో మార్పులు ప్రస్తుతానికి కనిపించలేదని ఉక్రెయిన్ స్టేట్ న్యూక్లియర్ రెగ్యులేటర్ తెలియజేసింది. అయితే ఈ ప్లాంటు రష్యన్ దళాల నియంత్రణలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్లాంటు లోని ఆరు రియాక్టర్లలో ప్రస్తుతం కార్యకలాపాలు జరగని, ఆధునికీకరణ పనులు జరుగుతున్న రియాక్టర్‌పై బాంబులు పడ్డాయని న్యూక్లియర్ ప్లాంట్ అధికార ప్రతినిధి ఆండ్రియ్ టుజ్ ఉక్రెయిన్ టెలివిజన్‌తో మాట్లాడుతూ చెప్పారు. న్యూక్లియర్ రియాక్టర్‌లో న్యూక్లియర్ ఫ్యూయల్‌ను ఉపయోగిస్తారని, ఆ తరువాత ఈ న్యూక్లియర్ ప్యూయల్‌ను తొలగించి నిల్వ చేస్తారని, దీనికి సంబంధించిన గోదాముపై బాంబు దాడి ప్రభావం పడినట్టు కనిపించలేదని చెప్పారు. న్యూక్లియర్ ఫ్యూయల్‌ను చల్లబరచే సామర్దాన్ని నిర్వహించడం చాలా అవసరమని, ఈ సామర్థం దెబ్బతింటే చెర్నోబిల్, ఫుకుషిమా ప్లాంట్ల కన్నా ఘోరమైన విపత్తు సంభవిస్తుందని రెగ్యులేటర్ హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు సముద్ర మార్గంలో రాకపోకలకు అవకాశం లేకుండా చేయడానికి రష్యాదళాలు జపొరిజ్జియా అణువిద్యుత్ కర్మాగారంపై దాడి చేశాయి.
జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో మంటలను ఆర్పేశాం: ఉక్రెయిన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -