Monday, December 23, 2024

వ్యవసాయ గోదాంలో మంటలు..కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం

- Advertisement -
- Advertisement -

గద్వాల జిల్లా, పెబ్బేరు మండల కేంద్రంలోన్ని వ్యవసాయ గోదాంలో సోమవారం మంటలు చెలరేగాయి. సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో గోదాంలో మంటలు చెలరేగి పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్న గుర్తించారు. వెంటనే ఫైర్ స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ధాన్యం, గన్నీ బ్యాగులు గోదాంలో ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.

మంటలు చెలరేగడానికి షార్ట్ సర్కూట్ కారణమా లేదా ఇతర ఏవైనా కారణలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. పెబ్బేరు మార్కెట్ యార్డ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే మార్కెట్ యార్డ్‌ను సందర్శించామని జెసి తెలిపారు. మార్కెట్ యార్డులో గన్నీ సంచులు పూర్తిగా దగ్ధమైపోయాయని, వాటి విలువ 10 కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలిపారు. మంటలు అదుపులోకి రాగానే విచారణ చేసి నష్టం అంచనా వేస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News