Wednesday, January 22, 2025

నాని కార్స్‌లో అగ్నిప్రమాదం..దగ్ధమైన 24 కార్లు

- Advertisement -
- Advertisement -

సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే కాంప్లెక్స్‌లో మంగళవారం అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో 24 కార్లు దగ్ధమైన సంఘటన యూసుఫ్‌గూడలో జరిగింది. యూసుఫ్‌గూడలోని గణపతి కాంప్లెక్స్‌లో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే నానీ కార్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విక్రయించేందుకు కార్లు నిలిపి ఉంచుతారు. ఈ క్రమంలోనే కాంప్లెక్స్‌లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో షోరూం మొత్తానికి వ్యాపించాయి. దీంతో అందులో విక్రయించేందుకు ఉన్న కార్లు 24 అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్కూట్ వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News