- Advertisement -
విద్యుత్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎంఎల్ఎ పుట్ట మధుకర్ కోరారు. మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్దమైన శివ శంకర్ కిరాణ దుకాణాన్ని ఆయన గురువారం పరిశీలించారు. బాధితుడు ఊదరి శంకర్ కుటుంబాన్ని ఆయన పరిశీలించి, ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో జీవనాధారమైన కిరాణ దుకాణంలోని సామాన్లు, వస్తువులు, డబ్బులు పూర్తిగా కాలి బూడిదయ్యాయని ఆవేధన చెందారు. ఆధారం కోల్పోయిన బాధితుడికి సాయం అందించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ప్రమాదంపై అధికారులు స్పందించి ప్రభుత్వ పరంగా ఆదుకునేలా చర్యలు చేపట్టాలని పుట్ట మధుకర్ కోరారు.
- Advertisement -