Wednesday, January 22, 2025

ఉప్పల్‌లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉప్పల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో అక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇటీవలే వరంగల్ ప్రధాన రహదారిలో షాపింగ్ మాల్ ప్రారంభించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. క్షణాలలో అక్కడికి చేరుకున్న బృందాలు మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశాయి. కానీ షాపింగ్ మాల్లో పెద్ద ఎత్తున దుస్తులు ఉండటంతో పాటు మంటలు త్వరగా షాపింగ్ మాల్‌కి పూర్తిగా అంటుకున్నాయి. సిబ్బంది లోపల ఎవరైనా ఉన్నారనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News