Friday, December 20, 2024

కొల్హాపూర్‌లో వందేళ్ల నాట్యగృహం దగ్ధం

- Advertisement -
- Advertisement -

చత్రపతి షాహూ మహారాజు కాలంలో వెలిసిన కళా వేదిక కేశవరావు భోసలే నాట్యగృహం గురువారం చెలరేగిన మంటల్లో ధ్వంసం అయింది. పట్టణంలోని ఈ నాట్యగృహం వంద సంవత్సరాల క్రితం నిర్మితం అయింది. అప్పటి పాలకులకు కళారంగం పట్ల ఉండే అబిమానం ఆదరణను చాటింది. పైగా కొల్హాపూర్ ప్రాంతపు సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టింది. భారీ స్థాయి అగ్ని ప్రమాదంలో ఈ వేదిక తగులబడిపోయిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. దర్యాప్తునకు ఆదేశించారు. కొల్హాపూర్‌లోని అత్యంత చారిత్రక కట్టడమైన ఈ నాట్యగృహాన్ని 1915లో కొల్హాపూర్ రాజు షాహూ మహారాజు నిర్మించారు. పలు సామాజిక సంస్కరణలకు కూడా ఇది వేదిక అయింది. గురువారం రాత్రి ఇక్కడ మంటలు చెలరేగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News