Monday, December 23, 2024

ముంబై హోటల్‌లో మంటలు.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై : స్థానిక శాంతాక్రజ్ ఈస్ట్‌లో ఆదివారం మధ్యాహ్నం ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారని , వీరిని చికిత్సకు ఆసుపత్రికి తరలించారని అధికారులు ఆదివారం తెలిపారు. ప్రభాత్ కాలనీలోని నాలుగు అంతస్తుల గెలాక్సీ హోటల్‌లో మధ్యాహ్నం 1.10 గంటలకు మంటలు చెలరేగాయి. దీనితో ఎలక్ట్రిక్ వైరింగ్, విద్యుత్ పరికరాలు, ఎసిలు, కర్టెన్లు, తివాచీలు, ఫర్నీచర్ తగులబడింది. మంటలలో చిక్కుపడి చనిపోయిన వారిని గుర్తించారు. వీరు రూపాల్ కంజీ (25), కిషన్ (28), కాంతిలాల్ గోర్దన్ వరా (48) అని నిర్థారించారు. ఆసుపత్రికి తరలించేలోగానే వీరు చనిపోయినట్లు నిర్థారణ అయింది. అగ్ని మాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులో పెట్టారు. అయితే అప్పటికే ప్రాణనష్టం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News