Tuesday, March 4, 2025

నోయిడా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నోయిడాలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 8లోని కార్డ్‌బోర్డ్ తయారీ కర్మాగారంలో రాత్రి 10 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎటువంటి హాని జరగలేదని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.
“భవనం యొక్క రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తుకు  వ్యాపించాయి. పది అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి” అని సైట్లో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను పర్యవేక్షించిన సింగ్ చెప్పారు. “ఎవరికీ హాని జరగలేదు. ఫ్యాక్టరీ ఆవరణలో మంటలు అదుపు చేశాము.  ప్రక్కనే ఉన్న భవనాలకు మంటలు చేరకుండా నిరోధించాము” అని ఆయన చెప్పారు. మంటలను పూర్తిగా నియంత్రించిన తర్వాత అగ్నిప్రమాదం, ఆస్తి నష్టానికి ఖచ్చితమైన కారణం అంచనా వేయనున్నట్లు సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News