Monday, December 23, 2024

రాజరాజేశ్వర కాటన్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ములుగు : ములుగు జిల్లా, ములుగు మండలం, జాకారం సమీపంలోని రాజరాజేశ్వర కాటన్ ఇండస్ట్రీలో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల రోజులుగా సిసిఐ ద్వారా కొనుగోలు చేసిన పత్తిని రాజరాజేశ్వర మిల్లుకు కేటాయించారు. మిల్లు నడుస్తున్న క్రమంలో ఎయిర్ కంప్రెషర్‌లో షార్ట్ సర్యూట్ కావడంతో మంటలు అంటుకొని పొగ దట్టంగా వ్యాపించింది. దీనిని గమనించిన కూలీలు కేకలు వేశారు. దీంతో యాజమాన్యం అప్రమత్తమై ఫైర్‌సేఫ్టీ సిలిండర్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసింది. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో ములుగు, పరకాల, నర్సంపేట నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, అగ్ని ప్రమాదం కారణంగా సుమారు 65 లక్షల మేర నష్టం జరిగినట్లు సిసిఐ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News