Wednesday, January 22, 2025

ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న టిఎస్ఆర్టీసీ అధికారులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. భద్రాచలం – హైదరాబాద్ కి వెళ్లే రాజధాని బస్సులు కాలం చెల్లిన బస్సులు వేస్తున్నారని విమర్శిస్తున్నారు.ఈ రోజు రాత్రి 10 గంటలకు బస్సు సర్వీస్ నెంబర్ : 34341 భద్రాచలం – బిహేచ్ఈఎల్ బస్సు బయలు దేరింది. మార్గం మధ్యలో పాల్వంచ – కొత్తగూడెం మధ్యలో బస్సు పై భాగం నుండి పొగలు రావడంతో బస్సును నిలిపివేశారు. కొత్తగూడెం డిపోలో ఏదో మార్మమత్తులు చేయించినంతరం మళ్ళీ బయలుదేరింది.ఇది ఇలా ఇలాంటి బస్సులో ఎలా ప్రయాణం చేస్తారని ప్రయాణికులు గోగ్గులు పెడుతున్నారు.భద్రాచలం డిపో అధికారులు ఖమ్మంలో అయిన వేరే బస్సు ఏర్పాటు చేయాలనీ ప్రయాణికులు కోరుతున్నారు.ఈ బస్సులో సీట్లు కూడా సరిగా లేవని ప్రయాణికులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News