Sunday, December 22, 2024

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని అంకుర ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం గుడిమల్కాపురంలోని ఉన్న అంకుర ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆస్పత్రి భవనం పదో అంతస్తులో ఉన్న ఆస్పత్రి బోర్డుకు మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ మెటీరియల్ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి నిప్పులు చిమ్మడంతో.. బిల్డింగ్ ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది.

మంటలు చెలరేగడంతో వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది.. రోగులకు బయటకు పంపించారు.
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎగిసిపడతున్న మంటలను నాలుగు ఫైర్ ఇంజిన్లతో అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News