Monday, July 8, 2024

మలక్ పేట్ లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలోని మలక్ పేట్ లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున మలక్ పేట్, మూసారాంబాగ్ చౌరస్తాలోని రెడ్ రోజ్ బేకరీ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ ప్రమాదంలో బేకరి పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమానులు వాపోయారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News