Monday, December 23, 2024

ఢిల్లీలోని కార్ షోరూమ్‌లో మంటలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మాయాపురి ప్రాంతంలోని కార్ షోరూమ్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ (డిఎఫ్ఎస్) అతుల్ గార్గ్ ప్రకారం, మాయాపురి ప్రాంతం నుండి ఉదయం 7:25 గంటలకు మంటల గురించి కాల్ వచ్చిందన్నారు. “మహీంద్రా కార్ షోరూమ్‌లో మంటలను ఆర్పడానికి మొత్తం 19 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి” అని గార్గ్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News