- Advertisement -
హైదరాబాద్: చందానగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం చందానగర్ లోని జెపి సినిమా మాల్ లో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
మూడు ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. జోనల్ కమిషనర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -