Sunday, April 27, 2025

ఈడి ఆఫీస్ లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ప్రాంతంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయ భవనంలో శనివారం మధ్య రాత్రి 2:30 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కురింభోయ్ రోడ్డులోని గ్రాండ్ హోటల్ సమీపంలోని ఈడి కార్యాలయం ఉన్న బహుళ అంతస్తుల కైజర్-ఐ-హింద్ భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్ల అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక దళం 12 ఫైరింజన్లతో రంగంలోకి దిగి సాహయక చర్యలను ప్రారంభించింది. ఈ మంటల్లో ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News